ప్రశ్నించొద్దు;- అంకాల సోమయ్య-దేవరుప్పులజనగాం9640748497
మా నాన్న ఎంత చెడ్డ పనిచేసిన అమ్మ ప్రశ్నించొద్దు
అమ్మ కుక్కిన పెనులాగా
నోరు మూసుకొని ఉండవలసిందే

నాన్న ఇల్లు వాకిలి తెగ నమ్మి
రోడ్డున పడే వరకు కూడా
అమ్మకు చెప్పనే చెప్పడు
అసలు నాన్నకు అమ్మ కంటే గొప్ప మంత్రి సలహాదారు స్నేహితుడు ఎవరున్నారు గనుక

అమ్మ ఇప్పుడు మా భవిష్యత్తునంత తన  కళ్ళముందే చూస్తూ
మూగగా రోదిస్తుంది
అమ్మకు అన్ని తెలిసినా
ఎదిరించలేని ,ఏమి చేయలేని నిస్సహాయురాలు

మా బంధువులు అంటుండేవారు 
మా అమ్మతో నీ కొడుకులుఎదిగితే, 
నీకు ఈ కష్టం ఉండదని
అన్నప్పుడు అమ్మ  కళ్ళలో
సంతోషం చూశాను
నిజంగా అమ్మలందరూ 
భూదేవతలే

శాంతా శమ దమాది గుణములు కలది భూదేవి కదా
అలాంటిదే మా అమ్మగూడా ---


కామెంట్‌లు