ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉండేవారు;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉండేవారు

భూగ్రహం మీద మానవులు తెచ్చి పెట్టుకున్న 
కులమతాల పంచాయితీ
రంగులు మార్చే ఊసరవెల్లి లాంటి పార్టీల మూలంగా

మనుషులు మనుషుల మధ్య
మానవీయ సంబంధాల్ని త్రుంచి వైషమ్యాల్ని పెంచి

ఒకరినొకరు దూషించుకొని
ఉద్వేగాలని రెచ్చగొట్టుకొని

తలలు తలలునరుక్కొని
ఈ నేలనంత వల్లకాడు చేసారు

ఇప్పుడు ఇక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది

పంచభూతాలు అయ్యో !
మనిషి
అమరుడయ్యాడయ్యాడే అని

ప్రకృతిని చూసి పరవశించే
మరో జీవరాశి కోసం మరో ప్రతి సృష్టికై 
ఎదురుచూస్తోంది

ఎక్కడో !
అక్కడక్కడ,

ఒకటో, అరో,
మిగిలిన మనుషులు

చెట్టుకొక్కడు పుట్టకొకడై
ఆత్మన్యూనత భావంతో
మౌనమునియై

ఆకాశం వంక చూస్తూ
తమకు తోడును పంపమని
దీనంగా వేడుకుంటున్నాడు


కామెంట్‌లు