ఓటును అమ్ముకొని ఓడిపోదామా?;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఓటును డబ్బుకమ్ముకొని
ఓడిపోదమా?
ఓటును మన అభివృద్ధికే వేసి
మనఆత్మ గౌరవం చాటుకుందామా?

దొంగ చేతికే
ఇంటితాళమిద్దామా?
కష్టసుఖాలు తెలిసినోణ్ణి
మన అభ్యర్థిగా ఎన్నుకుందామా?

ఎన్నికల బరిలో నిలిచిన
బడా వ్యాపారులకు
ఓటుతో తగిన గుణపాఠం చెబుదామా?
అతగాడితాయిలాలకి
ఆశపడి అవినీతిపరుడ్ని
అందలమెక్కిద్దామా?

ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొత్త పార్టీని
పాలనలోకి తీసుకొద్దామా?
ప్రజాస్వామ్య వ్యవస్థ కు
ఊపిరి పోద్దామా?

గ్రామసచివాలయంనుండ 
  (గ్రామసచివాలయంనుండి రాష్ట్ర సచివాలయం)
అసెంబ్లీ వరకు జరిగే ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరుద్దామా?

చదువు కున్న యువత చరితను మారుస్తారన్న నానుడిని
నిజం చేద్దామా?

ఓటంటే వ్యక్తి స్వార్థప్రయోజనం
కాదని?
ఓటంటే సామూహిక ప్రజాప్రగతి అని 
సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక జీవన విధానంలో
 ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగి
సుఖసంతోషాలతోవర్థిల్లిననాడు
ప్రజాస్వామ్యం వర్థిల్లేది
వ్యక్తి స్వామ్యానికి చరగీతం
పాడుదాం
సర్వేజనా సుఖినోభవంతు
సర్వసుజన సుఖినోభవంతు

కామెంట్‌లు