నియంతౌతాడు;- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ-9640748497
ప్రతి ఐదేళ్లకు ఒకసారి
పాలకుణ్ణి మార్చకుంటే
అతడు నియంతౌతాడు

ఉచిత హామీలకు తలొగ్గే గొర్రెలు ఓటర్లనే చులకనా భావనుంటది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది
ఈ వ్యవస్థకు జవం జీవం నీ ఓటన్నది మరువొద్దు 

అభివృద్ధి కాంక్షించే ప్రజలు ఓటును అమ్ముకోరు
తమకు రాజ్యాంగంయిచ్చిన సువర్ణావకాశాన్ని సుపరిపాలకునకే
అని తీర్మానించుకుంటాడు

అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటేయడంమూర్ఖత్వం
స్వతంత్రం అభ్యర్థికన్న ఓటేద్దాం
మనకు ఆత్మసంతృప్తన్నమిగులుతుంది

నోటు నాటు కానుకలు ఇచ్చి
నిన్ను ఏమార్చేవాడు అతడు
దోపిడికోరన్నవిషయంమరువొద్దు

విజ్ఞుతతో ఓటేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రతికి బట్ట కడుతుంది

అభ్యర్థులందరూ దొంగలే అన్న నిర్లిప్తభావన అంతమంచిది కాదు
అన్వేషిస్తే ఆణిముత్యాల్లాంటి
అభ్యర్థులు కూడా ఉంటారు

ఎన్నికల్లో చెడ్డవాళ్ళే‌పాలకులవుతున్నారని 
ఎదురు ప్రశ్నించడంకాదు
ఎటువంటి లాభాపేక్ష లేని సచ్ఛీలురు రాజకీయరంగంలోకి
వచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞతతో తగుసూచనలూ సలహాలు ఇవ్వాలి

ఇప్పుడు ప్రజల వాణిబాణి ప్రభుత్వానికి చేరవేయడానికి అనేక సామాజిక మాధ్యమాలు
అందుబాటులో ఉన్నాయి

విజ్ఞుతతోఓటేద్దాం
ప్రజాస్వామ్యానికి బాటేద్దాం

ప్రతి ఒక్కరిచేత ఓటేయిద్దాం
మన ఉనికిని చాటుకుందాం

ఓటురోజు సెలవని వ్యక్తిగత
పనులకు వెళ్లేవాళ్ళకు
ప్రజాస్వామ్యం అంటే ప్రజలచేత 
ప్రజలకొరకు ఏర్పడిన వ్యవస్థ అని గొంతెత్తి నినదిద్దాం

ఓటంటే నీ ఐదేళ్ల భవిత

ఓటంటే ఓటిదికాదు

ఓటంటే ఓటరు వజ్రాయుధం

ఓటంటే ఓటరుకు గల ప్రజాస్వామిక బాధ్యత

అందరంఓటేద్దాం 
సుపరిపాలనకు బాటేద్దాం


కామెంట్‌లు