ఆశేవిడకు అధైర్యపడకు;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
ఆశేవిడకు
అధైర్య పడకు
బ్రతుకంటే
వడ్డించిన విస్తరి 
కాదు --కాదు--
గెలుపోటములు
సహజం --సహజం-+-

శ్రీమంతులుకాదుగదా--
మనతల్లిదండ్రులు
కూటికోసమై--- మనకు
యాతనతప్పదుగా---

నిరాశ ఎదురైనదని---
న్యూనతకులోనుకాకు---
నిత్యం జ్వలించే ఆశతో--
నీ బ్రతుకును వెలిగించు---

ఉద్వేగం అదుపునుంటే----
ఉద్రేకం కలుగకుంటే---
ఓరిమితో --కూరిమితో--
బ్రతుకు ను గెలిపించు---


కామెంట్‌లు