కష్టజీవిది ఒడువని ముచ్చట;- అంకాల సోమయ్య,- దేవరుప్పుల-జనగాం-, 9640748497
రాత్రి పగలు కష్టం
రేపటి భవితకది ఫలితం
 చిందిన చెమటకు మూల్యమది
నీ బ్రతుకును వెలిగించిచే
 ఇంధనమది

మెతుకే దొరకని రోజుల్లో
నిద్రలేని రాత్రులు
 ఎన్నో?!
ఎండకు ,వానకు ,చలికి
తనువు పొందిన బాధలు ఎన్నో!?

మురికివాడే నరక కూపం
బాల్యమంతా వెట్టి చాకిరి?
బక్కచిక్కిన
 బడుగు జీవులు

తిండి లేక రోగగ్రస్థం

పని ఒకడిది
 ఫలితమొకడిది?

ఆవేదనొకడిది ?
ఆనందమొకడిది

పేరుల కష్టం 
దోచినదొరలు

గద్దెనెక్కి పెద్ద లైరి

ఆకాశానంటే మేడలు

ఆ ప్రక్కనే పూరి గుడిసెలు

ఇదేనా మన ప్రగతికి ఆనవాలు!?

ఇదేనా మన ఘన కీర్తికి నిలిపిన బురుజులు!?

విదిల్చే ఎంగిలి మెతుకులకు
ఎన్నాళ్ళిలా?!
 అర్రులు చాచేవు?

కష్టం నీది సౌఖ్యం వేరొకడిదా?

ఎదిరిస్తే పోవునేమీ?!
 నీ బానిస బ్రతుకుల విముక్తి తప్పా!?

నిరసనే 
నీ ఆయుధం !
నీ హక్కుల సాధనకై
 సంధించిన శరము!!

ఆలోచనే 
నీ ఆశను రగిలించి
నీ ఆశయాన్ని నెరవేర్చునుతుదకు!


కామెంట్‌లు