ఆడపిల్లనైననాపై
ఎన్నో ఆంక్షలు విధించి
ఎందుకమ్మా
అన్నను గాలికొదిలేసావు
మమ్మల్ని కన్నది
నువ్వేకదా ఎందుకమ్మా
ఇంటాబయటా
నాకేఎన్నో జాగ్రత్తలు
చెప్పి
ఇది చేయి ఇది చేయకని
అడుగడుగునా అడ్డుగోడలు
కడతావు
ఇంటేడుచాకిరితోపాటు
నాన్న పనులకు
నువ్వు చేదోడు వాదోడుగా ఉంటావు
అమ్మ నేనో మాట అడగనా!
వంటపని ఇంటిపని ఇదిఆడవారు,చేసే పనే అని
ఏమన్నా భారతరాజ్యాంగంలో
పొందుపరిచారా !
అమ్మా
నాన్న అన్న నీకు ఇంటి పనిలో
సహకరిస్తే వారి మగ అహం
ఆత్మ గౌరవం నేలకూలిపోతదా?
ఎందుకమ్మా ఇక్కడ ఆడామగా వివక్ష
నేను బడిచదువు పూర్తి చేసి
కాలేజీ లో చేరుతానంటే
నాన్న ససేమిరా వద్దంటే
నన్ను కాలేజీలో చేర్చడం కోసం
నువ్వు మహాయుద్దమేచేసావు
ఎన్ని ప్రమాణాలు చేయించుకొని నన్ను కాలేజీ కి పంపావో ?నాకింకా గుర్తుంది
అమ్మ !
నేను ఆధునిక మహిళను
నేను నీలా పాతకాలపు ఆడదాణ్ణికాదు
నేనుఅణచివేత చట్రాన్ని
దాటి బయటకొచ్చి సువిశాల విశ్వంలో
నేనో స్వేచ్ఛా విహంగాన్ని
ఇప్పుడు అన్నిరంగాల్లో మహిళలు తమ ప్రతిభను కనబరుస్తున్నారు
ఆమ్మానేనో
కాకతీయ సామ్రాజ్ఞి ఓ రాణి రుద్రమ దేవి లా!
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ లా!
నర్మదాబచావో సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ లా!
మయన్నార్ నేత ఆంగ్ సాంగ్ సూకీ లా!
గగనతలాన్నిచుట్టోచ్చినసునితావిలియంలా, కల్పనా చావ్లా లా!
స్త్రీలహక్కులకై ,ఆత్మగౌరవానికై
పోరాడిన ఓమల్లాది సుబ్బమ్మ లా!
దేశ్ ముఖ్ ల నెదించిన వీరవనిత చాకలి ఐలమ్మ లా!
సారా వ్యతిరేక పోరాటాన్నినడిపినదూబగుంటరోషవ్వలా!
ఓ స్త్రీవాద రచయిత్రి
ఓ ఓల్గాలా!
ఆకాశంలో సగమన్న ఓకాత్యాయనీ విద్మహే లా!
నేను ఎదుగుతానమ్మా
స్త్రీల ఆత్మ గౌరవానికై
పోరాడుతానమ్మా
ఆకాశంలో సగం జనాభాలో సగమున్న మహిళలకు
ఎన్నో ఆంక్షలు విధించి
ఎందుకమ్మా
అన్నను గాలికొదిలేసావు
మమ్మల్ని కన్నది
నువ్వేకదా ఎందుకమ్మా
ఇంటాబయటా
నాకేఎన్నో జాగ్రత్తలు
చెప్పి
ఇది చేయి ఇది చేయకని
అడుగడుగునా అడ్డుగోడలు
కడతావు
ఇంటేడుచాకిరితోపాటు
నాన్న పనులకు
నువ్వు చేదోడు వాదోడుగా ఉంటావు
అమ్మ నేనో మాట అడగనా!
వంటపని ఇంటిపని ఇదిఆడవారు,చేసే పనే అని
ఏమన్నా భారతరాజ్యాంగంలో
పొందుపరిచారా !
అమ్మా
నాన్న అన్న నీకు ఇంటి పనిలో
సహకరిస్తే వారి మగ అహం
ఆత్మ గౌరవం నేలకూలిపోతదా?
ఎందుకమ్మా ఇక్కడ ఆడామగా వివక్ష
నేను బడిచదువు పూర్తి చేసి
కాలేజీ లో చేరుతానంటే
నాన్న ససేమిరా వద్దంటే
నన్ను కాలేజీలో చేర్చడం కోసం
నువ్వు మహాయుద్దమేచేసావు
ఎన్ని ప్రమాణాలు చేయించుకొని నన్ను కాలేజీ కి పంపావో ?నాకింకా గుర్తుంది
అమ్మ !
నేను ఆధునిక మహిళను
నేను నీలా పాతకాలపు ఆడదాణ్ణికాదు
నేనుఅణచివేత చట్రాన్ని
దాటి బయటకొచ్చి సువిశాల విశ్వంలో
నేనో స్వేచ్ఛా విహంగాన్ని
ఇప్పుడు అన్నిరంగాల్లో మహిళలు తమ ప్రతిభను కనబరుస్తున్నారు
ఆమ్మానేనో
కాకతీయ సామ్రాజ్ఞి ఓ రాణి రుద్రమ దేవి లా!
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ లా!
నర్మదాబచావో సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ లా!
మయన్నార్ నేత ఆంగ్ సాంగ్ సూకీ లా!
గగనతలాన్నిచుట్టోచ్చినసునితావిలియంలా, కల్పనా చావ్లా లా!
స్త్రీలహక్కులకై ,ఆత్మగౌరవానికై
పోరాడిన ఓమల్లాది సుబ్బమ్మ లా!
దేశ్ ముఖ్ ల నెదించిన వీరవనిత చాకలి ఐలమ్మ లా!
సారా వ్యతిరేక పోరాటాన్నినడిపినదూబగుంటరోషవ్వలా!
ఓ స్త్రీవాద రచయిత్రి
ఓ ఓల్గాలా!
ఆకాశంలో సగమన్న ఓకాత్యాయనీ విద్మహే లా!
నేను ఎదుగుతానమ్మా
స్త్రీల ఆత్మ గౌరవానికై
పోరాడుతానమ్మా
ఆకాశంలో సగం జనాభాలో సగమున్న మహిళలకు
రాజకీయ సామాజిక రంగాల్లో సగభాగం
దక్కేవరకు పోరాడుతానమ్మా?
ఆపోరాటం మనఇంటినుండే
మొదలుపెడతానమ్మా?
యత్రనార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవతః
అనే నానుడికి కొత్త భాష్యం చెబుతానమ్మా!
ఎక్కడైతే స్త్రీలు ఆత్మగౌరవంతో
సాధికారతతో సుఖసంతోషాలతో ఉంటారో
అక్కడ దేవతలు కొలువై ఉంటారు
ఏదేశం
ఆర్థిక ప్రగతిలో ముందడుగేస్తుందో
దక్కేవరకు పోరాడుతానమ్మా?
ఆపోరాటం మనఇంటినుండే
మొదలుపెడతానమ్మా?
యత్రనార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవతః
అనే నానుడికి కొత్త భాష్యం చెబుతానమ్మా!
ఎక్కడైతే స్త్రీలు ఆత్మగౌరవంతో
సాధికారతతో సుఖసంతోషాలతో ఉంటారో
అక్కడ దేవతలు కొలువై ఉంటారు
ఏదేశం
ఆర్థిక ప్రగతిలో ముందడుగేస్తుందో
అక్కడ మహిళల ప్రాతినిధ్యం పెరిగినట్టమ్మా
జయహో మహిళా
జయజయహో మహిళా
మహిళా సాధికారత వర్థిల్లాలి
జయహో మహిళా
జయజయహో మహిళా
మహిళా సాధికారత వర్థిల్లాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి