మంచి ,మానవత్వం
దయా,జాలి
నైతికత,
మానవ విలువలు
మనం ఇంటాబయటా (ఇంట్లో బడిలో)
నేర్పడమే
మరచిపోయాం
(మానేసాము)
ఎంత సేపు జీవన వేగం పెంచి
జీవన యానం దుర్మార్గంగా
మార్చుకుంటున్నాము
పసిపిల్లల మనస్సులు కూడా
కలుషితం చేసాము
కార్పోరేట్ ,సెమికార్పోరేట్ సంస్థలిప్పుడు
విద్య వైద్యం వ్యవసాయం
అన్నిరంగాల్లో తమ పాదంమోపాయి
ధనం మూలం ఇదం జగత్ అంటూ
పసితనం నుండే వారికి ఒత్తిడిని పెంచుతున్నాయి
రెడీమేడ్ చదువులు
రెడీమేడ్ ఫుడ్ లా మారి
పసిపిల్లలు ఇప్పుడు
సెన్సిటివిటీ(సున్నితత్వం) లేని వారై
ఆవేశంతో ఊగిపోతున్నారు
టీనేజ్ లోనే అపసవ్య డైట్
అపసవ్వ జీవనవిధానంతో
గుండె పోటు తో మరణిస్తున్నారు
ఈ చావులకు కారకులెవరు?
అరచేతిలో భోగభాగ్యాల జీవితం చూపిన కార్పోరేట్ లా?
ఆ( ఈ)మాయా వలలో చిక్కి ఒక్క గా నొక్కకొడుకును
పోగొట్టుకున్న అత్యాశపరులైన తల్లిదండ్రులా?
ఇప్పుడు ఎవరిని శిక్షించాలి?
చేతికి అందివస్తాడన్నకొడుకే శవమై
తనకే తలకొరివి పెడతాడనుకుంటే
కొడుక్కేకన్నతండ్రి
తలకొరివి పెట్టే పరిస్థితి దాపురించింది
ఈ పగటివేషపు కార్పోరేట్ దోపిడీకోరులపై దుమ్మేత్తి పోస్తున్నాడు
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు!?
ఏమి చేయలేని నిస్సహాయతతో?!
ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు? ఎర్రిబావులోడై
ఆ(ఓ)తండ్రి ?!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి