సుభాషితాలు;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
కొరగాని కొడుకుతో
కొంపకు చేటుగదా?
వేరుపురుగుచేరి
వృక్షాన్నేచెరచెగదా?

మంచివాడిస్నేహం
మంచి పాలతీరు
చెడ్డవారిస్నేహం
బొగ్గు పాలతీరు

జన్మనిచ్చిన
తల్లి దండ్రులంటే?
ఏవగింపు చూపి
రేపు నువ్వు తల్లిదండ్రైతే
తెలిసేనా ?
కొడుకులతీరు?

నువ్వు చూపినతోవ
నీ కొడుకు నడిచెగా?

నువ్వు క్షమించమని
కోరుటకు నీ తల్లిదండ్రి
శివైక్యం

తప్పు చేయనోడు
లేడుగద? 
జగతిలో
తప్పు దిద్దనోడే
నిజమైన దోషిగదా?

యత్నదోషపద్దతి
అన్నింటామేలౌనా?

ఏమి తెలియనపుడు
యత్నదోషమునెంచు

తెలిసితప్పుచేయుట
తెలివిలేనితనమౌను?


కామెంట్‌లు