నేటి విద్యార్థి రేపటి ఆశాజ్యోతి;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
నేను నేడు
విద్యార్ధిని

రేపటి టీచర్ ను
 డాక్టర్ ను
లాయర్ ను
ఇంజనీర్ ను
రాజకీయవేత్త ను
సామాజిక కార్యకర్త ను

ఇదంతా నా మానసిక శారీరక
శ్రమననుసరించే నేను రేపు
సాధించేది

ఇదంతా నా అకుంఠిత దీక్షా
తత్పరతతో మాత్రమే నాకు
సాధ్యమయ్యేది
నా చుట్టూతా నన్ను ఏమార్చే
లోక ముంది 
అయినా ఉచితానుచితం
నేను అనుక్షణం బేరీజు వేసుకుంటున్నవాణ్ణి

సంకల్పంతో ఏదైనా సాధ్యమే అని 
మహనీయుల జీవిత చరిత్ర ఆధారంగా 
తెలుసుకున్న వాణ్ణి

నేను ఆదర్శవంతమైన మార్గంలో ముందుకెళ్తున్న వాణ్ణి

రేపటి తరానికి సారథిగా
నిలిచే రేపటి ఆశాజ్యోతిని 

రేపటి పౌరుణ్ణి


కామెంట్‌లు