ప్రతిరోజు నాదే;- అంకాల సోమయ్య దేవరుప్పుల-జనగాం-9640748497
నన్ను నేను
సంస్కరించుకున్నా---

నాలోని
బలహీనతల్ని
బలాలుగా
మలుచుకున్నా

అసమర్థుడన్న
లోకులకు
గెలుపుతో
గురిచూసి
కొడుతున్నా

నాలో నూతనోత్సాహం పెల్లుబికింది
అందుకే నేను
మార్పు దిశగా ముందడుగు
వేస్తున్నా

నాలో
జవసత్వలు
ఉడవకముందే

ఉరకలెత్తే
ఉత్సాహంతో

నన్నునేను
సమాయత్త
పరచుకుంటున్నా

కాలాన్ని
నా గుప్పిట్లో బిగించి
కాలపరీక్షలన్నింటా
ఉత్తీర్ణత సాధించి

సామాజానికే
నేను ఆదర్శప్రాయుడ(వుతా)
నయ్యా

ప్రతి రోజూ
నాకే
సొంతంగా
మలుచుకున్నా

నేను మీలాంటి
మనిషి నే---
నాలోని దుర్గుణాల్ని
దూరం చేసుకొని
నేను మనీషిగా
మనుగడ
కొనసాగిస్తున్నా2
కామెంట్‌లు