కవిని కాదు నేను;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.
అక్షరం బంధమై
భావోద్వేగం ఉబికుబికి వస్తుంది నాలో

చీకటిని దునుమాడే ధైర్యాయుధమై 
సూర్యోదయం వస్తుంది నాలో

నింగిని పిలిచే మెరుపై
మేఘసందేశం వీస్తుంది నాలో

మంచిని మేల్కొల్పే చైతన్యం
 కొలువైన సమాజం జీవించు నాలో

నేను కవిని కాదు 
రవినీ కాదు
వెల్లువనూ కాదు, వర్షాన్నీ కాదు

ఓ మామూలు మనిషిని నేను
మానవత్వ చింతనైన మనసూ నేనే

కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Wonderful sensitivity reflected in this emotional verse
Which has appropriate and beautiful diction and poet's humility in the ending lines.Congrats to the.poet..