స్పర్శ ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు- 9849305871
నాలుక మీది ఉసిరికల పరుగు
అలసటలేక మీటిన గాలి తంత్రులు 
ఆకాశం భూమి కలిసే చోట నడకే 
మాటా మంతీ మౌనవంతెన

అతనిలో నెనరైన స్వసంస్కరణే 
కొత్త విలువల అన్వేషణ 
ఐతే అది 
వినడానికి మామూలుగా ఉన్నా
స్వీయ స్పర్శ పలకడానికి 
కదిలాలి తీగలు స్వరవీణల 

మనసు పరుగుల బండి అప్పుడప్పుడు
మాట వినని మొండి కూడా
కాలం కొసలు పట్టి నేర్చిన నడక
యాతనదీర చెమటగక్కుతుంది 
దౌడు ఒకటే ఆగని యాంత్రికం  
కవిత్వమే జీవితమై రాసుకున్న పుస్తకం తొంగిచూసే స్పర్శ 

కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Higher images and symbolical.Difficult for ordinary reader to understand.Ultimate creativity is the gist of the verse and the realized speaker.Congrats to the.poet