నారి సంధించిన నారీ! వందనం;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
ఆకాశంలో సగమనే
సంస్కారానికి సాదర నమస్కారం
సగం కాదు,ఇక సాధించేదే ఎక్కువుంది 
సంపూర్ణత వైపు 'అడుగు'పరుగులెత్తే నారిని నేను

మా అమ్మగదూ!అవనివిగదా!!
అన్నీ నీవనే మీ ముద్దూ మరిపానికి
మనసారా వందనం ...
చేసే నా ప్రయాణం నాదే
అబల నుండి సబల దాకా, 
నాన్నాఅన్నల కన్నుల వెలిగే దారి నేనే

మనసు చల్లని చందమామ
తపం చోదక అంతరిక్ష వ్యోమనౌక
స్వేచ్ఛగా ఎగిరే రెక్కలు
చుక్కల్లో మామను పట్టిన ధైర్యం నేను

ఊడ్చే ఇంటి చీపురు చేవను 
పిసికే మట్టిచేతులు నేనే
కథలూ కావ్యాల కవాతు కలం నేనే
వివక్ష బందీ పోరున స్వేచ్ఛ వీర విహంగాన్నీ నేనే

లక్ష్యాలను ఛేదించే విజయ దుందుభి నేనే
స్వచ్ఛ్ భారత్ లో మాట్లాడే మహిళను, అపర కాళినీ నేనే

కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Excellent honour to a woman