ఓం నమశ్శివాయ - తారక మహా మంత్రము ( అష్టాక్షరీ గీతి) "కవిమిత్ర" శంకర ప్రియ., శీల.,సంచార వాణి:- 99127 67098
    "ఓం"కారమే ప్రణవము!
 పరమేశ వాచకము!
     తారక మహామంత్రము!
 శివా నమో! నమః శివా!
           🪷(2)
     "పంచాక్షరి"యే శివము!
  పంచ భూతాత్మక మైన
    పావన మంత్ర రాజము!
  శివా నమో! నమః శివా!
          🪷(3)
       అథ "ఓం నమశ్శివాయ "
  భవ"తారక మంత్రము"!
      మంగళకర మంత్రము!
  శివా నమో! నమ శ్శివా!
           🪷 (4)
       ప్రణవ సహితమైన
  శ్రీమత్ శివపంచాక్షరి!
      శ్రేయోదాయక మంత్రము!
  శివా నమో! నమ శ్శివా!
⚜️ఓం నమశ్శివాయ శుభంశుభం!
   కురుకురు శివాయ నమఓం! 
     [ శ్రీశివ పంచాక్షరీ వింశతి (20) వర్ణ మాలిక.,]
కామెంట్‌లు