ఏక శ్లోకీ సుందరకాండ- కవిమిత్ర, శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
 🔱సుందర హనుమంతుని
దివ్యలీలా వైభవము!
    సుందరమైనదీ గాథ
సుందరకాండ! సుమతీ!
    [ అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,]
👌హనుమంతుడు.. కార్యదీక్షా పరుడు! రామచంద్రుని యందు భక్తిశ్రద్ధలతో; సుగ్రీవాజ్ఞను శిరసావహించి, దక్షిణదిశకు బయలుదేరాడు! లవణసముద్రము దాటి, లంకానగరము చేరుకున్నాడు! అచ్చట అశోకవనమునందు సీతాదేవినిచూచి, రాముడు సమర్పించిన ముద్రికనిచ్చాడు! తరువాత, లంకాదహనము కావించి, రాక్షసయోధులను హతమార్చి, కిష్కింధ కేతెంచాడు! పిమ్మట, సీతామాత ఇచ్చిన, ఆభరణంను రామునకు అందజేశాడు; శ్రీరుద్ర వీర్యాంశ సంభూతుడైన, ఆంజనేయుడు! 
    ఇదీ సుందరకాండ సంగ్రహము! శివమస్తు! 
            ⚜️ఏక శ్లోకీ:-
     తీర్త్వాక్షార పయోనిధిం, క్షణమథోగత్వా శ్రియః సన్నిధిమ్;
    దత్వా రాఘవ ముద్రికా మపశుచం క్రుత్వా ప్రవిశ్యాటవీం!
     భఙ్త్వానేక తరూం, నిహత్య బహుళామ్ రక్షోగణం స్తత్పురీమ్
    దగ్ధ్వా అదాయమణి రాఘూద్వహమగాద్వీరో హనూమాన్ కపిః!
        
       🚩ఉత్పల మాల 
     క్షారసముద్రమున్ క్షణపు కాలమునందున దాటి, వెంటనే
     శ్రీ రమరూపిణీ యయిన సీతకు ముద్రికనిచ్చి, యుక్తితో
    కారును జొచ్చి, లంకనట గాల్చి, నిశాటుల జంపి, రత్నమున్
     ధీరుని కందజేసిన సుధీవరు మారుతి నెన్ని కొల్చెదన్!
        (👌కారు = అడవి)
[ పద్య రచన:- డా. శాస్త్రుల రఘుపతి.,]
🚩శ్రీహనుమ! జయ హనుమ! జయజయ హనుమ!
            [ షోడశాక్షరీ (16) నామ మాలిక ]
కామెంట్‌లు