శ్రీమాత.. త్రిశక్తి స్వరూపిణి;- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.-,సంచార వాణి:- 99127 67098
 🙏శ్రీమాత! శ్రీమహారాజ్ని!
  ముగ్గురమ్మలకు నీవె
      మూలపుటమ్మవు తల్లి!
  జయజయ జగన్మాత!
      [అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ ]
          శ్రీమదాది పరాశక్తి... లోకైకమాత! ఇచ్ఛాశక్తి - జ్ఞానశక్తి - క్రియాశక్తి స్వరూపిణి! శ్రీమాత.. త్రిశక్తులుగా. అనగా, శ్రీగౌరి.. శ్రీలక్ష్మి.. శ్రీవాణి..  మూర్తులుగా వ్యవహరింపబడు చున్నది!
      శ్రీలలితాoబికను.. "వాణి"యని, "లక్ష్మి"యని, "గౌరి"యని,  "శాకంభరి"యని సంభావింపబడు చున్నది! సృష్టి..  స్థితి..  ప్రళయము లనెడు, మూడు దశలలోను విరాజిల్లుతున్నది.. శ్రీమాత! అటువంటి ముల్లోకములకు గురువైన, పరమేశ్వరునియొక్క దేవేరి, పరమేశ్వరిని.. రెండుచేతులను జోడించి నమస్కరించు చున్నాను! అని, జగద్గురు ఆది శంకరులు ప్రస్తుతించారు!
         🌷ప్రార్ధనా శ్లోకం:-
  గీర్దేవ తేతి, గరుడధ్వజ సుందరీతి,    
  శాకంభ రీతి, శశిశేఖర వల్లభేతి,
  సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
  తస్యై నమ: త్రిభువనైకగురో స్తరుణ్యై!!
        [శ్రీకనకథారా స్తవము..12.వ. శ్లోకరత్నము ] 
        🙏ఉత్పల మాల 
     శారద చంద్రికచరణ చారుశరీరిణి యైన "వాణి"గా 
     క్షీర సముద్రజాత సువిశిష్ట సమీక్షితయైన "లక్ష్మి"గా
     మారతనూ హరార్ధ సుకుమార తనూహరియైన "గౌరి"గా 
      ఆరసికొందు మూడుదశలందున మూడుజగాల లీలగా !!
      [ తెనుగు సేత:- వెలుదండ సత్యనారాయణ.,]
 
      🔯ఓం శ్రీమాత! జయ శ్రీమాత! జయజయ శ్రీమాత!
    ( శ్రీమాత షోడశాక్షరీ (16) నామ మాలిక.,)
కామెంట్‌లు