మహాశివ లింగ మూర్తి (అష్టాక్షరీ గీతి ) కవి మిత్ర శంకర ప్రియ., శీల.,- సంచార వాణి:- 99127 67098
  ఆదియు అంతము లేని
  మహా జ్యోతిర్లింగ మందు    
      ఆవిర్భావం కావించిన
  సదాశివ! నమఃశివా!
             🪷(2)
      అభి వందనము శివ!
  అభవా! విభవా! శివ!
      ఆద్యంత రహితా! శివ!
  అంబికేశ! నమఃశివా!
         🪷  (3)    
      భూమ్యాకాశముల మధ్య
   మహాలింగ స్వరూపంగా    
      విరాజిల్లు స్వామి వీవె!
   విరాడ్రూప!  నమఃశివా!
             🪷(4)
      శ్రీహరియు విరించియు
   లింగం మొదలు చివర
      కనుగొన లేకున్నారు!
    శివాzలింగ! నమఃశివా!
  
     🔆ఓం నమశ్శివాయ శుభంశుభం
      కురుకురు శివాయ నమ ఓం!
             [ శ్రీ శివ పంచాక్షరీ వింశతి (20) వర్ణ మాలా మంత్రం ]
కామెంట్‌లు