అమూల్యమైనది 'బాల్యము';- -గద్వాల సోమన్న,9966414580
అందమైన బాల్యము
జీవితాన భాగ్యము
దీవెనలకు మూలము
వెలుగులీను దీపము

ఆనందాల తీరము
అనురాగాల ద్వారము
ముద్దులొలుకు బాల్యము
అత్యంత అమూల్యము

చీకుచింత లేనిది
కల్మషమే కానిది
పవిత్రమైన బాల్యము
జన్మలో శ్రేష్టము

బేధాలు చూపనిది
శత్రుత్వమెరుగనిది
స్నేహమనిన ఇష్టము
కలహాలకు దూరము

సాటిలేని బాల్యము
దేవుని నైవేద్యము
పంచునోయి స్వర్గము
పెంచునోయి బంధము

అమ్మ జోలపాటలో
మమకారపు మేడలో
పయనించే బాల్యము
తేజస్సుకు మార్గము

కామెంట్‌లు