నిజమేగా! మిత్రమా!!;- -గద్వాల సోమన్న,9966414580
 బ్రతుకులోన బాధలు
అలముకున్న మబ్బలు
కలకాలం ఉండవు
గాలిలోన వ్రాతలు

శ్రద్ధ లేని చదువులు
మనసు లేని మనువులు
సత్ఫలితాలివ్వవు
క్రమం లేని బ్రతుకులు

స్త్రీలు లేని గృహములు
ఆదుకొనని కరములు
కళ తప్పిన ముఖములు
అమావాస్య రాత్రులు

మంచి లేని మనుషులు
పంచ లేని మమతలు
ఎంచగా మరీచికలు
లేవు కదా మేలులు

కామెంట్‌లు