వాస్తవాల వెన్నెల హారం;- -గద్వాల సోమన్న,9966414580
సముద్రాన్ని తోడితే
ఖాళీ చేయగలమా!
విద్యాదానం చేస్తే
తరిగి తరిగి పోతుందా!

సూర్యుడే ఉదయిస్తే
ఎవరైనా ఆపగలరా!
పూదోట విరబూస్తే!
తావులే దాచగలరా!

పసి పిల్లలు నవ్వితే
అందాలే పూయవా!
ఇంటిలో నడయాడితే
శుభములే అరుదెంచవా!

పెద్దలను గౌరవిస్తే
దీవెనలే కురియవా!
వృద్ధులను ఆదరిస్తే
మేలులే దరి చేరవా!

ప్రతి దానికీ ఫలితము
ఖచ్చితంగా ఉంటుంది
వారి వారి క్రియలకూ
బహుమానం తెస్తుంది

కామెంట్‌లు