అక్షరాల ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580-
అక్షరాల దీపాలు వెలిగించు
అజ్ఞానం బ్రతుకుల్లో తొలగించు
విద్యాదానం బహు గొప్పది
నీ చేతనైతే సహకరించు

తల్లిదండ్రులను సదా పూజించు
పెద్దలను తప్పక గౌరవించు
విస్తారమైన దీవెనల వెలుగులు
అడుగడుగునా దర్శనమించు

సమాజ మార్పుకై ఉద్యమించు
అలముకున్న వివక్షతనెదురించు
బడుగుజీవుల అభివృద్ధిని కోరి
నీ వంతు కర్తవ్యం నిర్వర్తించు

ఆశయాల బాటలో పయనించు
ఆనందాల తోటలో విహరించు
మానవత్వం ఒక్కింత నింపుకుని
ఆదర్శాల కోటలో జీవించు

కామెంట్‌లు