ధీమా వ్యక్తం!;- -గద్వాల సోమన్న,9966414580
గాలి మేడల్లో నివసిస్తాం
గగన వీధుల్లో పయనిస్తాం
జాబిలమ్మతో చెలిమి చేసి
వెన్నెలవానల్లో  తడిచొస్తాం

కొండకోనల్లో విహరిస్తాం
వెలుగునీడల్లో జీవిస్తాం
పెందలకడనే నిద్రపోయి
వేకువజాములో లేసేస్తాం

తగిన వేళల్లో స్పందిస్తాం
పున్నమి రోజుల్లో  మురిసేస్తాం
గెలుపు బాటల్లో నడిసేస్తాం
పూల తోటల్లో నడిపిస్తాం

కష్ట సమయాల్లో ఆదుకుంటాం
కరుణ హస్తాల్లో వాలిపోతాం
భరోసా కాసింత కల్పిస్తే
విజయ తీరాల్లో ఆడుకొంటాం

కామెంట్‌లు