పిచ్చుక సందేశం;- -గద్వాల సోమన్న,9966414580
దానవత్వం వదలరా!
మానవత్వం చూపరా!
పసి పిల్లల హృదయాల్లో
దైవత్వం దొరుకురా!

శత్రుత్వం భూతంరా!
క్రూరత్వం పెంచునురా!
క్షమాగుణం కల్గియుండి
ప్రేమతత్వం పంచుమురా!

చెప్పుడు మాటలు వినకురా!
కాపురాలు కూల్చకురా!
పచ్చని కుటుంబాల్లో
నీవు చిచ్చు పెట్టకురా!

బంధాలే త్రెంచకురా!
కన్నీళ్లు తెప్పించకురా!
చేతనైతే పదిమందికి
చేయూత కల్పించరా!

కామెంట్‌లు