అక్షరాల నిజం! నిజం!!;- -గద్వాల సోమన్న,9966414580
రైలు పట్టాలే కలవవు
భూమ్యాకాశాలు కలవవు
అక్షరాల ఇది నిజం! నిజం!!
విరిగిన మనసులు కలవవు

తూర్పు పడమరలు కలవవు
ఉత్తర దక్షిణలు కలవవు
అక్షరాల ఇది నిజం! నిజం!!
వెలుగు చీకట్లు కపవవు

నీటిపై రాతలు నిలవవు
గతి తప్పిన మనసులు నిలవవు
అక్షరాల ఇది నిజం! నిజం!!
కడలిపై తరగలు నిలవవు

గాలిలో దివ్వెలు వెలగవు
నేలపై ఓడలు నడవవు
అక్షరాల ఇది నిజం! నిజం!!
కఠిన హృదయాలు కరగవు

పరిస్థితులు ఒకేలా ఉండవు
కన్నీళ్లు అనిశము ఉండవు
అక్షరాల ఇది నిజం! నిజం!!
కష్టాలు సతతం ఉండవు

కామెంట్‌లు