ఆశీస్సులు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 జయభేరి మ్రోగింది జగములోన
నవకాంతి విరిసింది పుడమిపైన
వారటము లిక వాయముగ మనక
సరస సల్లాపములాడు పిల్లలోలె
మురిసి కురిసినాయి ధాన్యరాశులెల్ల
ధరణిజ పుట్టిన భూమి మనది
రఘురాముడేలిన రాజ్యము మనది
హాయిగా పదివేల యేండ్లదాక
సహచర సహకార సహము గల్గి
మువ్వన్నెవిల్లు భరతజనుల మదిని
కఱకు కఱకఱులు మాన్పివేసి
మరునయ్య,మరుగొంగ,మర్కుడు త్రిమూర్తులై
నీవరములెల్ల నిండు సౌఖ్యములతో
యశముగల్గి యుండి
ముక్కోటి యేండ్లదాక ముదముతో మనుమని
రాశిపోసిరీ ఆశీస్సులు మన భరతభూమి పైన!!

{వారటము=పొలము;వాయముగ=వ్యర్థముగ;
సహము=వెలుగు;మువ్వన్నెవిల్లు=ఇంద్రధనువు;
కఱకు=కఠినమైన;కఱకఱులు=బాధలు;
మరునయ్య=విష్ణువు;మరుగొంగ=శివుడు;
మర్కుడు=బ్రహ్మ;నీవరములు=ఇండ్లు;
మనుమని=జీవించుమని}
--------------------------------------------------------------
కామెంట్‌లు