శ్రీవిష్ణు సహస్రనామాలు బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
416)ఋతుః -

కాలములో ఋతువులైనవాడు
సమయం విభజన చేయువాడు
ఋతుధర్మం అనుసరించు వాడు
ప్రకృతిమార్పులు తానైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
417)సుదర్శనః -

భక్తికి దివ్యదర్శనమైనవాడు
విష్ణుచక్రము తానైనట్టివాడు
అమరావతియుందున్నవాడు
మనోహర దర్శనమిచ్చువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
418)కాలః -

శత్రువులను కబళిoచువాడు
కాలుడై సంహారం చేయువాడు
మృత్యువుగా సమీపించువాడు
చావురూపంలో శత్రునాశకుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
419)పరమేష్టీః -

హృదయ గుహలో నుండినవాడు
అంతరంగ ప్రకాశమైనవాడు
పరబ్రహ్మము తానైనవాడు
పరమేష్టియై ప్రకాశించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
420)పరిగ్రహః -

ప్రియముతో పుచ్చుకొనువాడు
భక్తిని స్వీకరించుచున్నవాడు
భక్తులకు ఉపకరించువాడు
ఇష్ట స్వీకరణము చేయువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు