సుప్రభాత కవిత ; - బృంద
గుబులుగున్న గుండెలో
గుసగుసమని గుట్టేదో
విప్పి చెప్పి ఓదార్పుగా
వెన్నుతట్టి నేనున్నానంటూ..

వెదుకుతూ నాకోసం
వెలుతురంతా మోసుకొచ్చి
మబ్బేసిన మదిలో
ప్రేమ వర్షం కురిపించినట్టూ..

కలతల చీకటి నిండిన
మనసుకు గోరంత వెలుగునిచ్చి
వేలవేలుగ వెలుతురు పూలను
ఎద నిండా పరచినట్టూ..

రేపేమిటీ?? అన్న భయం పోయి
ఏమిటో చూద్దామన్న 
ధైర్యం ఇచ్చే వెలుగేదో
హృదయంలో పుట్టినట్టూ..

ఒకటి కోరిన హృధికి
వేయిగా వరములిచ్చి
ఒంటరినన్న భావము లేక
తానే ఒక సైన్యమని తలచి

బ్రతుకు పోరుకు సిధ్ధం
అంటూ  లేచి నిలబడి
అడుగేసి అన్నీ మరచి
ఆశలే తోడుగా పయనించే

ఉత్తేజమిచ్చే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు