శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
[2:13 pm, 6/03/2024] Umadevi Nelluru: 351)బుద్ధః -

విశ్వాకారములో నున్నట్టివాడు
ప్రపంచం రూపుదాల్చినవాడు
బుద్ధ జ్ఞానము నిచ్చునట్టివాడు
ధరణిలో భాసిల్లుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
352) వృద్ధాత్మాః -

సృష్టి పూర్వమునుండీగలవాడు
ఆత్మయందు జ్ఞానమున్నవాడు
అందరికి పెద్దయైనట్టి వాడు
విశ్వముకు మూలమైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
353)మహాక్షః -

గొప్పనేత్రాలున్నట్టి వాడు
పెద్దవైన కన్నులున్న వాడు
అన్నీ వీక్షించుచున్న వాడు
విశ్వ వీక్షణము చేయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
354)గరుడధ్వజ-

గరుడ పతాకమున్నట్టివాడు
ధ్వజము గరుత్మంతుడైనవాడు
వైనతేయ జెండాగలవాడు
గరుడ ధ్వజుడైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
355)అతులః -

సాటిలేని విభవమున్నవాడు
తూచలేని జ్ఞానముగలవాడు
చెప్పలేని తేజముగలవాడు
అతులిత బలమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
[2:33 pm, 6/03/2024] Umadevi Nelluru: శ్రీ విష్ణు సహస్రనామాలు 
ఎం. వి. ఉమాదేవి 
(బాల పంచపది )6-3-2024

356)శరభః -

శరీరములందున్నట్టి వాడు
ప్రత్యగాత్మగా యున్నవాడు
వేర్వేరుగా ప్రభవించువాడు
ప్రకాశమును గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
357)భీరుః -

భీకర శక్తిని గలిగినవాడు
వెనుదిరగని వీరుడైనవాడు
అపారశక్తినివ్వగల వాడు
అజేయునిగా నిలిచినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
358)సమయజ్ఞః -

సర్వులను దీవించువాడు
సమభావనలనిచ్చు వాడు
సమాదరించుచున్నవాడు
ఆదరణ పూజగా తలచువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
359)హవిర్హరిః -

యజ్ఞములకు వేంచేయువాడు
హవిస్సులు స్వీకరించువాడు
హరి రూపముననున్న వాడు
యజ్ఞఫలము నొసగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
360)సర్వ లక్షణలక్షణ్యః -

సర్వప్రమాణములున్న వాడు
సిద్ధజ్ఞానవంతుడైన వాడు
లక్షణములు నిర్ణయమైనవాడు
సర్వసాత్వికమైనట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు