నమస్కారం;- -డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పాశ్చాత్య వాసనలతో
నిద్రాముద్రితమైన సమస్తమానవాళిని
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో జాగృతంచేసి
భద్రాయితమూర్తిగా తీర్చిదిద్దిన
కరోనావైరసునికి నమస్కారం!
ప్రతి పౌరుడిలో గట్టిపట్టుదలనూ, కలిసికట్టుతనాన్నీ,
దేశభక్తినీ,సేవాసక్తినీ, మంచినడవడినీ పెంపొందించిన
కరోనావైరసునికి నమస్కారం!
కవిగాయకులను తట్టిలేపి, పరిశోధకులకు వెన్నుతట్టి,
వైద్యులతో నెయ్యమునెరిపి, శుధ్ధరులతో హాస్యమాడి,
భటులకు సద్యోక్రోధమునందించిన
కరోనావైరసునికి నమస్కారం!
కరోనా నిరోధకోద్యమముతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ
భారత సంస్కృతీప్రియులుగా, సాహితీప్రియులుగా, 
కళాప్రియులుగా, కరుణాప్రియులుగా, దానప్రియులుగా
ప్రజలను సంఘటితం చేసిన
కరోనావైరసునికి నమస్కారం!!
**************************************

కామెంట్‌లు