దివ్యజ్ఞానమూర్తి!;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 వరకవిగా వెలుగొందిన సిద్దప్ప
తెలగాణపు తొలి సమాజకవి కదనప్పా!
జ్యోతిష,వాస్తు,ఆయుర్వేద,యోగ,
సంగీత,సాహిత్య ప్రవీణుడైన దివ్యతేజోమూర్తి!
ప్రస్తుత సిద్దిపేటజిల్లా,గుండారెడ్డిపల్లి అనే
మారుమూల గ్రామంలోని శాలివాహనకులంలో
లక్ష్మి,పెద్ధరాజయ్య దంపతుల పవిత్రగర్భాన
జన్మించిన సురలోకపు దివ్యదేవతామూర్తి!
సమాజ మూఢత్వాన్ని, రుగ్మతలను,
అసమానత్వాన్ని సూటిగా ఖండించి
తన రచనలద్వారా సమాజానికి
జ్ఞానబోధ చేసిన దివ్యగురుమూర్తి!
తన నలుబది గ్రంథాల రచనతో
ప్రపంచాన్ని మేల్కొలిపిన దివ్యసాహితీమూర్తి!
తత్వబోధకవిగా తాత్విక రచనలతో
తెలుగు సాహిత్య చరితలో తనకంటూ ఒక
ప్రత్యేక స్థానాన్ని పొందిన దివ్యతత్వమూర్తి!
మహారాష్ట్ర,కర్ణాటక,తెలుగు రాష్ట్రాలలోని
అశేష శిష్య,భక్త,అభిమాన గణాన్ని
ప్రభావితం చేసిన దివ్యజ్ఞానమూర్తి!
**************************************
కామెంట్‌లు