శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
331)వాయువాహనః -

పవనములను నిలుపువాడు
గాలిని ప్రసారముజేయువాడు
వాయువును మోయునట్టివాడు
ఊపిరినిచ్చుచున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
332)వాసుదేవః -

అంతటా నిండియున్నవాడు
విశ్వవ్యాప్తి చెందినట్టి వాడు
వసుదేవుని కొడుకైనవాడు 
కృష్ణభగవానుడయినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
333)బృహుద్భానుః -

కిరణాలతో ప్రకాశించువాడు
సూర్యనారాయణుడైనవాడు
బృహుత్ కిరణములు గలవాడు
భానునితో సమానుడైనవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
334)ఆదిదేవః -

సృష్టికార్యానికి ఆరంభకుడు
దేవతలకు ముందేయున్నవాడు
అనంతమైనట్టి వాడు
విశ్వపాలనము జేయువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
335)పురంధరః -

రాక్షసపురాలను కూల్చినట్టివాడు
ఇంద్రునితోటి సమానుడు
పుణ్యధామముల నుండువాడు
పౌరులనుద్ధరించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు