ఓరి దేవుడా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఒంటరితనముతో
నన్ను వేదించకు
తోడూనీడతో
నన్ను మురిపించు

చీకటీలోనికి
నన్ను తోయకు
వెలుగునుండి
నన్ను వేరుచేయకు

ఏడుపు
నాదరి ఎప్పుడూచేరనీకు
సంతసం
నన్ను విడిచివెళ్ళనీకు

ద్వేషాన్ని
నాచెంతకు రానీకు
ప్రేమను
నానుండి పారదోలకు

తొందరచేసి
నను తికమకపెట్టకు
నిబ్బరముగా
నను ముందుకునడుపు

వంకరటింకరలు
నాకు వద్దనేవద్దు
ముక్కుసూటితనాన్ని
నాకిచ్చి నడిపించు

అవినీతిని
నాకు అంటనీకు
న్యాయమార్గాన్ని
నను విడవనీకు

పరభాషను
నాకు అంటగట్టొద్దు
తెలుగుభాషను
నన్ను మరువనీయవద్దు

అందాలు
నాకు చూపించు
ఆనందాలు
నాకు ఇప్పించు

పువ్వులు
నాకు అందించు
నవ్వులు
నాకు కలిగించు

మంచితనం
నాకు చూపించు
మానవత్వం
నాకు నేర్పించు

దైవమా
నన్ను కరుణించు
దేవుడా
నాకు మోక్షమివ్వు

కామెంట్‌లు