క్రూర వనం;- సి.హెచ్.ప్రతాప్
 సమాజం తీరు బహు విచిత్రం
పిల్లిలా తన మానాన తాను బ్రతికితే
సుఖంగా, ప్రశాంతంగా బ్రతకనివ్వదు
పులిలా తిరగబడితే
తోక ముడుచుకు పారిపోతుంది
అదను దొరికితే చాలు
మన బతుకు వనంలో
చిచ్చు పెట్టేందుకు యత్నిస్తుంటుంది
మన ఆర్తనాదాలు, అసహాయతలు
దానికి వినసొంపుగా ఉంటుంది
మన ఆక్రందనలు దానికి ఆటవిడుపు
మన బాధలు దానికి వినోదాలు
మనం ఏడిస్తే అది తృప్తిగా నవ్వుతుంది
పైపూతగా సానుభూతి చూపుతునే
గాయాల్ని మరింత రేపుతుంది.
అందుకే సింహంలా జూలు విదల్చాలి
గాండ్రిస్తూ బెదరగొట్టాలి
విషసర్పంలా బుసలు కొడుతునే వుండాలి
అప్పుడు భయంతో సమాజం వణుకుతూ
అల్లంత దూరంలో నిలబడిపోతుంది
చెడు ఎవరికీ తలపెట్టకు
అయితే నిన్ను నువ్వు రక్షించుకో
అప్పుడే ఈ క్రూర వనంలో బ్రతకడం సాధ్యం
కామెంట్‌లు