పద్యాలు. ; సాహితీ సింధు,పద్యగుణవతి సరళగున్నాల
 తలరాతలు మార్చుటకై
తలలకు విద్యాసుగంధ తైలములద్దన్
పలుకుల తేనియ జిమ్ముచు
వలవేసెను మొండి బాల బాలికలకుతా
****************************
సుద్దులనెల్లయుజెప్పుచు
విద్దెలనందింపతానె విజ్ఞాన ఖనై
యద్దెను నొద్దిక తనమును,
బుద్ధిని వికసింపజేయ పూనెనుజననీ
కామెంట్‌లు