శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
351)బుద్ధః -

విశ్వాకారములో నున్నట్టివాడు
ప్రపంచం రూపుదాల్చినవాడు
బుద్ధ జ్ఞానము నిచ్చునట్టివాడు
ధరణిలో భాసిల్లుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
352) వృద్ధాత్మాః -

సృష్టి పూర్వమునుండీగలవాడు
ఆత్మయందు జ్ఞానమున్నవాడు
అందరికి పెద్దయైనట్టి వాడు
విశ్వముకు మూలమైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
353)మహాక్షః -

గొప్పనేత్రాలున్నట్టి వాడు
పెద్దవైన కన్నులున్న వాడు
అన్నీ వీక్షించుచున్న వాడు
విశ్వ వీక్షణము చేయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
354)గరుడధ్వజ-

గరుడ పతాకమున్నట్టివాడు
ధ్వజము గరుత్మంతుడైనవాడు
వైనతేయ జెండాగలవాడు
గరుడ ధ్వజుడైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
355)అతులః -

సాటిలేని విభవమున్నవాడు
తూచలేని జ్ఞానముగలవాడు
చెప్పలేని తేజముగలవాడు
అతులిత బలమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు