ప్యాకేజ్డ్ ఆహారంతో జాగ్రత్త !;- సి.హెచ్.ప్రతాప్
  ప్రస్తుతం ఆర్టిఫిషియల్ హవా నడుస్తోంది. ఆహారాన్ని సులభంగా పొందేందుకు ఆన్ లైన్ సదుపాయాలు మనకు అందుబాటులోకి వచ్చేసాయి . యాప్ ల ద్వారా ఒక్క క్లిక్ తో కావలసిన ఆహారాన్ని నిమిషాలలో డెలివరీ చేసే సంస్థలు పుట్టగొడుగుల్లా  పుట్టుకొస్తున్నాయి. అంతే కాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ఆహార పదార్థాలు నిల్వ ఉండటానికి కొన్ని రసాయనాలను కలపక తప్పదు. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు ఇప్పుడు వున్నాయి. నచ్చింది వండుకోలేక.. ప్యాకెట్ ఫుడ్ కు అలవాటు పడి రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. హార పదార్థాల్లో బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి ప్రాసెస్ చేసిన పదార్థాల్లో రసాయనాలను ఉపయోగిస్తుంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కి సమర్పించిన ఒక అధ్యయనంలో నైట్రేట్‌లు, నైట్రోసమైన్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు.బ్రెడ్ వంటి కొన్ని ఆహారాలు, బయటపెట్టకుండా వదిలేస్తే, కాలక్రమేణా ఫంగస్ ఏర్పడుతుంది. ఈ ఫంగస్ లు హానికరమైన టాక్సిన్స్ ఉత్పత్తి చేయగలవు. కాబట్టి వీటిని తినడం మానుకోవాలి.  చాలా ఫంగస్లకు జీవించడానికి ఆక్సిజన్ అవసరం, కాబట్టి అవి సాధారణంగా ఆక్సిజన్ పరిమితంగా ఉన్న చోట వృద్ధి చెందవు. అయితే, ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయకపోతే ఆహారం మీద ఫంగస్ త్వరగా పెరుగుతుంది.ప్రీ-ప్యాక్డ్‌ సూప్‌లు, సాస్‌లు, ఫ్రోజెన్ పిజ్జాలు, రెడీ-టు-ఈట్ మీల్స్ వంటి అల్ట్రాప్రాసెస్డ్‌ ఫుడ్స్ తింటే అకాల మరణాల ముప్పు అధికంగా పెరుగుతుందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. బ్రెజిల్‌ లో అకాల, నివారించదగిన మరణాల్లో పది శాతం మరణాలకు ఇలాంటి ఫుడ్ తీసుకోవడమే కారణం అని ఈ అధ్యయనం తేల్చింది.
కామెంట్‌లు