ఉల్లాసంగా.. ఉత్సాహంగా నో బ్యాగ్ డే
 తొట్టంబేడు:మండలంలో దిగువ సాంబయ్య పాళెం ప్రాథమిక పాఠశాల లో ప్రతి నెలా మొదటి,మూడవ శనివారం నో బ్యాగ్
డే లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొ న్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు
కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లా డుతూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి
తోర్పడేది విద్య అని, సృజనాత్మక
కృత్యాలకు వేదిక పాఠశాల అని ఒత్తిడి
లేని విద్య నేర్పాలని అన్నారు.దానికి
నో బ్యాగ్ డే మంచి అవకాశం అన్నారు.
పేపర్ ప్లేట్స్ తో విద్యార్థులు బొమ్మలు
తయారు చేసారు.పద్య పఠనం,యోగా,
ధ్యానంతో పాటు ఆట , పాటలతో అల
రించారు.
కామెంట్‌లు