కారణ జన్ముడు క్రీస్తు..! -కోరాడ నరసింహా రావు..!
పాలకుల నిరంకుశ , నీయంతృత్వాలకు... 
 పాలితులు బలి కారాదని... 
 తెలియ జెప్ప వచ్చిన బోధకు డతడు..! 

చేతి స్పర్శతోభయం కర రోగములను బాపిన ధన్వంతరియతడు.! 

ముళ్ల కంపను తలకు తగిలించి
 మోయలేని సిలువను భుజానవేసి, కొరడాలతోకొడు తూ... కొండపైకి ఈడ్పించినా... 

ఏడ్చు చున్న ప్రజలను ఓదార్చుచూ... 
 నాకొరకు ఏడవకండి...
 మీకొరకు, మీ బిడ్డల కొరకు ఏడవ0డని.... 
 మీ వలే మీ పొరుగు వారినీ ప్రేమించుడని... పర హితమునేకోరుదయా సాగరు డితడు  ! 

మేకులు పెట్టి తనను సిలువపై
 దిగ్గొట్టినా... 
   ప్రాణములు పాయినవా... ఉన్నవా యని బల్లెముతోపొడిచి చూస్తున్నా

తండ్రీ... వీరేమి చేయుచున్నా రో , వీరెరుగరు... వీరి పాపమఘ క్షమింపుమని... 
 ప్రార్ధించిన ఆ పరమపితపుత్రు డితడు...! 

కారణ జన్ముడు క్రీస్తు...! 
 తన కార్యమును నిర్వర్తించి
 తరలి పోయినాడు....! 
   ********
కామెంట్‌లు