శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
431)అనర్థః -

తానేదియు కోరలేనివాడు
ఏదీ ఆశించనట్టి వాడు
ఎటువంటి అర్ధింపులేనివాడు
కోరికలు యుండనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
432)మహాకోశః -

అన్నమయములలో నున్నవాడు
పంచకోశాలున్నట్టి వాడు
తనయందే సర్వమున్నవాడు
విశ్వవ్యాప్తిగా యుండినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
433)మహాభాగః -

చిద్విలాసముగా నున్నవాడు
ఆనందస్వరూపుడైన వాడు
మహాభాగ్యం కలిగినవాడు 
నిత్య సంతోషంగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
434)మహాధనః -

గొప్ప ఐశ్వర్యము గలవాడు
సంపదలను పొందినవాడు
ధనధాన్య వృద్ధి గలవాడు
మహాధనవంతుడైన వాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
435)అనిర్విణ్ణః -

వేదనలు లేకుండువాడు
నిర్లిప్తముగా నున్నట్టివాడు
దేనికీ చలించనట్టి వాడు
ప్రశాంతముగా నున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు