శ్రీవిష్ణు సహస్రనామాలు బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
401-వీరః -

పరాక్రమశాలియైన వాడు 
వీరులలో ఘనమైనవాడు
వీరముద్రికలున్నట్టి వాడు
శత్రువుల ఓడించగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
402)శక్తి మతాంశ్రేష్ఠః -

శక్తిమంతులలో శ్రేష్ఠమైనవాడు
బలిమిని గలిగినట్టివాడు
ఉత్సాహము నున్నట్టివాడు
సత్వమును ఈయగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
403)ధర్మః -

ధర్మస్వరూపుడైనట్టి వాడు
న్యాయంమును నిలుపగలవాడు 
ఆచారము పాటించుచున్నవాడు
సామ్యము గలిగినట్టి వాడు 
 శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
404)ధర్మవిధుత్తమః -

ధర్మము తెలిసినట్టి వాడు
ధర్మాచరణము చేయువాడు
విధులు నిర్వహించగలవాడు
ధర్మాచరణలో శ్రేష్ఠతున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
405)వైకుంఠః -

సృష్టి ఆదినుండి ఉన్నవాడు
శ్రేష్టమైన ప్రదేశమునుండువాడు
పంచభూత సమ్మేళనచేయువాడు
వైకుంఠనివాసియైన వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు