మార్పు కోసం..! ;- కోరాడ నరసింహా రావు..!
రోజూ  లానే... ఈ రోజూ... 
  సూర్యుదు తూర్పునే ఉ ద యించాడు...! 
 ఎన్నో సూర్యోదయాలు.... 
  ఎటువంటి మార్పూ లేదు.!! 
  ఇది నిత్య మైన సత్యం... 
    సత్య మైన నిత్యం..! 
 ఇ వె ప్పు డూ  మరవ్..!! 

మారాల్సింది నువ్వే... 
 మార్చుకోవలసింది నీ తీరే..! 

నిన్న ని గుర్తు పెట్టు కో.. 
   భావిష్యత్తును ధృడంగా
     తీర్మానించుకో... 
  వర్త మానాన్ని పగటి కలలతో
    వృ ధా చేయక... 
  చిత్తసుద్ధితో పరిశ్రమించు

నీవాసించే రోజు వచ్చే తీరుతుంది ! 

ఆరోజు... అన్ని రోజుల్లాఉండ దు
 అన్ని ఉదయాల్లా... అదీ మరో
  సాధారణ ఉదయం కాడు..
అది నవ్య కాంతుల దివ్యోదయమవు తుంది ..! 

ప్రతి మనిషి జీవితం... 
 ఇలా ఓ ప్రత్యేక మైన
  ఉదయాన్ని చూడ గలగాలి
 లేకుంటే ఆ బ్రతుకు నకుఅర్ధ మేముంటుంది..!? 
 ఈ మానవ జన్మకు పరమార్ధ మేముంటుంది...?! 
        ******
కామెంట్‌లు