వాలే పక్షి!!! ప్రతాప్ కౌటిళ్యా ;-
పక్షి ఎగిరిన తర్వాత ఆకాశం ఆవేశ పడింది.
పక్షి నక్షత్రమై ఆకాశంలో మెరిసింది.
ఆకాశం అప్పుడు ఆశపడింది నేను పక్షినైతే
చల్లని మేగంపై ఎగురొచ్చని!!!

ఎగిరిన పక్షి గగనం చల్లని చూపైందీ!!

రెక్కలు విరుచుకొని గుండెను సరి చేసుకుని
సముద్రాన్ని దాటింది.

సముద్రంలోని చేప పక్షిని పరీక్షగా చూసింది.

ఎక్కడో పొరపాటు జరిగింది
మేఘాన్ని సృష్టించిన సముద్రం
పక్షిని ఓడించలేకపోయింది.!!

పక్షి గగనమంతా పారింది.

నది ఓ ములుగు మూలిగి భూమంతా 
పారలేక జలపాతమైందీ!!

నదికి ఎదురెక్కిన చేప పిల్ల మెల్లిగా నదిని ఓదార్చింది.!!

ఎగిరితే పక్షిలా ఎగరాలని
ఎదిగితే పక్షిలా ఎదగాలని
పారితే పక్షిలాపారాలని
మహా పర్వతం పక్షిని ఆహ్వానించింది.!!

గట్టిగా గాలి వీస్తే నేలకు పడిపోయే పక్షి
గాలిలా మారింది
లోయలను పర్వతాలను ఆక్రమించింది!!

గగనాన్ని గెలిచిన పక్షి ఎప్పుడు భూమిపై తాకకూడదని
చిట్టచివరకు చిట్టడవి చెట్టుకొమ్మ పక్షి పాదాలకు ఆధారమైంది.!!

ఎగురులేని చెట్టు పక్షికి ఏం చెప్పింది!
పక్షి చెట్టుకు ఏం సందేశం ఇచ్చిందో
ఇంతవరకు ఎవరికీ తెలియదు.!!!!?

పక్షులు మాత్రం ఆ చెట్టుపై వాలుతూనే ఉన్నాయి.!!!

ఎన్నో సూర్యుళ్ళు,, ఎన్నో చంద్రుళ్ళు
ఆకాశం నుంచి దిగి
పక్షులా చెట్టుపై వాలిపోతున్నాయి!!!?

డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏
కామెంట్‌లు