వోని లో పల్స్ పోలియో కార్యక్రమం
 వోని గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పాలకొండ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కనపాక సూర్యప్రకాశరావు పసిపిల్లల నోటిలో రెండు చుక్కలు వేసి ప్రారంభించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ రెండు పోలియో చుక్కలు వేసేలా ఆరోగ్య శాఖ ఉద్యోగులు బాధ్యత వహించారు. నిండు జీవితానికి రెండు చుక్కలు, తరిమేద్దాం తరిమేద్దాం పోలియో వ్యాధిని తరిమేద్దాం, పోలియో రహిత దేశం మనందరి లక్ష్యం అంటూ గ్రామంలో తొలుత ర్యాలీ నిర్వహించడమైనది. ఐదేళ్ల లోపు 108మంది బాలబాలికలకు రెండేసి
పోలియో చుక్కలను శతశాతమూ వేయడమైందని ఆరోగ్య శాఖ ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఆర్.కిశోర్, ఎం.ఎల్.హెచ్.పి కిల్లాడి అనూష,  ఎ.ఎన్.ఎం. ఆరిక సుశీల, అంగన్వాడీ కార్యకర్తలు ముడిముంచి వెంకటమ్మ, 
బిడ్డిక శుభలక్ష్మి, 
ఆశా కార్యకర్తలు టి.హైమవతి, వి.నీలవేణి, సి.హెచ్.డబ్ల్యు డి.హరిత, మునపాక లక్ష్మి, పత్తిక భూలక్ష్మి పాల్గొన్నారు.
కామెంట్‌లు