ఒం నమో గాయత్రి శివ ; - కోరాడ
ఒం నమో గాయత్రి శివ ; 
భవాన్యై నమః....! శ్రీ మాత్రే నమః
            ఓం శా0తి ...!
    *******
34 రోజుల విరామము తరువాత నా మదిలో విరిసిన 
తొలి కవన కిరణం....! 
 - కోరాడ నరసింహా రావు..! 
        * అనేక  మేకం....!!*
    ********
   ఈ పంచ భూతాత్మ ప్రకృతి విక్రీడిత ఆక్రుతులకు.... 
 ఇన్నిన్ని మనో బుద్ది చిత్త హం కారాలా...!?

ఇన్నిన్ని సంకల్ప- వికల్ప వైరు ద్య,వైవిధ్యాలకు.... 
  సమన్వయ నిర్వికల్ప నిశ్చలానంద మేనాటికో...! 

అనురాగం  -  అసహ్యం... 
 ప్రేమ  -  ద్వేషం... 
  స్నేహ0  -  వైరం.... 
   అన్నీ ... పరస్పర విరుద్దాలే!! 

ఈ పొంగి పోడాలూ... 
  కృ0గి పోడాల జీవన కేలి లో
 ఈ అసత్యఆనందాలహాయిలో
  ఈ మాయా ప్రపంఛానికే ... మోహితుడై... 
 మనుగడ సాగిస్తున్న మనిషికి
 సత్యం తెలిసే దెన్నడో ...!! 

   ఓ మనిషీ...! 
    నీ యదార్ధ పాంచ భౌతిక తత్వాన్ని తెలుసుకో...! 
 ఆపుడు ఈ ద్వంద్వము లన్ని
 సమన్వ యింపబడి.... 
  ఈ అనేకమైన ఏక తత్వం 
 దర్శన మిస్తుంది..!! 

ఇంక ఎట్టి వైరు ద్యాలు.... 
  వైవిద్యాలు... కానరావు...! 
 నీవే... బ్రహ్మవై... 
 నీవే  విష్ణు వై... 
 నీవే  మహేశ్వరునివై... 
 ఈ జగమంతా నీవే యై.... 
  ఈ ప్రపంచం లో... 
 నీవు తప్ప  అన్య మైన దేదీ
 లేదనే సత్యాన్ని... 
 గ్రహించ గలుగు తావు...!! 

ఇది కదా సత్య దర్సనమ్..! 
ఇపుడు కదా నిశ్చ లానందం..!! 
ఇదే కదా..నీవాస్తవస్వరూపము

ఈ పంచ భూతాత్మకం... 
  దేనిలో... అది కలసి పోయి... 
 విశ్వస్వరూపమైవిరాజిల్లటమే!
   ఇదే...పరిపూర్ణము...
   ఇదే...అంతిమం...!! 
             ఓం శా0తి ...! 
    ********
కామెంట్‌లు