పాఠకుల స్పందనలు- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అవి
ప్రశంసలవర్షమా
కాదు
పూలజల్లులు

అవి 
వానచినుకులా
కాదు
ప్రేమధారలు

అవి
ఇష్టాలా
కాదు
మెప్పులు

అవి
వ్యాఖ్యలా
కాదు
ఆనందాలు

అవి
పలకరింపులా
కాదు
అభినందనలు

అవి
ఆవేశాలా
కాదు
ఆత్మీయతలు

అవి
స్పందనలా
కాదు
మనోభావాలు

అవి
విమర్శలా
కాదు
పరామర్శలు

అవి
తాత్కాలికమైనవా
కాదు
శాశ్వతమైనవి

అవి
ముచ్చట్లా
కాదు
చప్పట్లు

అవి
కామిక్కులా
కాదు
టానిక్కులు

పాఠకలోకానికి
ధన్యవాదాలు
సాహిత్యలోకానికి
ప్రణామాలు
కామెంట్‌లు