శ్రీవిష్ణు సహస్రనామాలు బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
391)తుష్టః -

సంతృప్తి గలిగించువాడు
తృప్తిని గలిగినట్టి వాడు
భక్తులకు తుష్టతనిచ్చువాడు
సంపూర్ణతలో నున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
392)పుష్టః -

పరిపూర్ణుడు అయినట్టివాడు
పూర్తిదివ్యత్వమున్న వాడు
పుష్టిని కలిగించగలవాడు
పూర్ణత్వమును ప్రసాదించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
393)శుభేక్షణః -

శుభదృష్టి గలిగినట్టివాడు
చూపుతో భాగ్యమిచ్చువాడు
ఆశీస్సులు ఒసగునట్టివాడు
శుభ వీక్షణము ఉన్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
394)రామః -

నిత్యానందము నిచ్చుచున్నవాడు
చైతన్యము లోపలున్నవాడు
రమణీయమైనట్టి వాడు
అవతారస్వరూపమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
395)విరామః -

జీవులకు శాంతినిచ్చువాడు
విరామస్థానము తానైనవాడు
విశ్రాంతిని ఇవ్వగలవాడు
తనదరికి చేర్చుకొనువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు