మహిమ గల మహిళ !!-డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా
అది ఒక పూల తోట
అక్కడ అన్ని
సీతాకోచిలుకలు-వాళ్లు మహిళలు!!

అది ఒక పళ్ళతోట
అక్కడ అన్ని
చిలుకలు-వాళ్లు మహిళలు!!

అది ఒక గోపురం
అక్కడ అన్ని
పావురాలు-వాళ్లు మహిళలు!!

అది ఒక పచ్చని చెట్టు
అక్కడ అన్ని
కోయిలలు-వాళ్లు మహిళలు!!

అది ఒక పచ్చని మైదానం
అక్కడ అన్ని
గువ్వలు-వాళ్లు మహిళలు!!

అది ఒక అడవి
అక్కడ అన్ని
నెమళ్లు-వాళ్లు మహిళలు!!

ఇది మహిళల ప్రపంచం
మహిమగల ప్రపంచం!!!

రత్నాలు వాళ్లు-ముత్యాలు వాళ్లు
పగడాలు వాళ్లు
కోహినూరు వజ్రాలు వాళ్ళు
మహిళా మణులు వాళ్లు!!!

ఇనుము కాదు
ఉక్కు మహిళలు వాళ్ళు!!

రాగి కాదు
ఇత్తడి మహిళలు వాళ్ళు!!

కుందనపు కాదు
చందనపు బొమ్మలు వాళ్లు
పుత్తడి బొమ్మలు వాళ్లు
మహిళలు వాళ్ళు!!! మహిళా మణులు వాళ్లు!!0

వాళ్లుండే ప్రపంచం ప్లాటినం
వాళ్లు జరుపుకుంటున్నది
ప్లాటినం జూబ్లీ!!

ఇది మహిళల ప్రపంచం
మహిమగల ప్రపంచం!!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిh పురస్కరించుకుని.
ఈ కవిత మహిళా మణి మాధవి గారికి అంకితం.

డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏
కామెంట్‌లు