ఆనందపరవశం;- డా.భరద్వాజ రావినూతల
 ప్రశాంతమైన నిశిరాత్రి మెరిసిన మెరుపు..
మానసోల్లాస నందనోద్యానవనాన మైమరపు..
సుషుప్తావస్థన జోగుతున్ననానేత్రాకాశాన విరిసింది..
కనులను ఉడికిస్తూ..
ఊరిస్తూ..
నామనోసంద్రాన్ని ఆనందపారవశ్యం చేసింది..
నిద్రపోతున్న నిశీధి...
కన్నుపొడిచినా కానరాని‌విభావరి..
అధ్బుత ఆవిష్కరణల స్వాగతగీతం..
తెలియని ఆనందాల మనసుపరవశం..
దారి తెన్నులేకుండా సాగిపోతుంది..
కంచికి‌చేరకుండా ఆగిపోతుంది..
ఆకలల అలలు నీటిమీదరాతలు..
అందుకలేని నింగి చుక్కలు..
ఎడారి ఎండమావులు..
అని తెలియదు మనసుకు..
మనసుతెరమీద ఆశల‌చిత్రమై..
రెక్కలొచ్చిన గుర్రంలా..
శిఖరాలనుండి జారే జలపాతంలా..
అలరించి- మురిపించి-
ఆనందింపచేస్తుంది..
 *తెల్లారిందిలేరా*అన్న 
అమ్మ పిలుపుతో అదృశ్యమవుతుంది..
భగ్నమవుతుంది స్వప్న సుందరభవనం..
ఆలోచనాభావతరంగం..
కలలుకనటంతప్పుకాదు..
సాకారం చేసుకోలేక పోవడం తప్పు.
అన్నమహనీయుని‌మాట శిరోధార్యం..
🦚🦚🦚🦚🦚🦚⛱️🦚🦚
కామెంట్‌లు