సోమన్న విరచిత 'మల్లె మొగ్గలు' పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో
 కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్న  రచించిన 'మల్లె మొగ్గలు'  48వ పుస్తకం  విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఏ.యల్.కృష్ణారెడ్డి మరియు విశ్రాంత భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ శ్రీ వి.డి. రాజగోపాల్ ,కళారత్న శ్రీ బిక్కి రత్న మరియు ఆర్.వి.మల్లీశ్వరి గారల చేతుల మీద,విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో,శ్రీ ఏ.పవన్ కుమార్& శ్రీమతి రాధికరెడ్డి దంపతుల గృహ ప్రవేశం సందర్భంగా బొల్లినేని బైసన్,కొండాపూర్, హైదరాబాద్ లో ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాన్ని శ్రీ వి.డి రాజగోపాల్ గార్కి  అంకితమివ్వడం విశేషం. పిమ్మట కృతి కర్త గద్వాల సోమన్నను బాలసాహిత్యంలో వారి విశేష కృషికి గాను సత్కరించారు.ఈ కార్యక్రమంలో గాయకులుశ్రీ రవీంద్ర బాబు, శ్రీ చంద్రశేఖర్ పిళ్ళై,  శ్రీ ఏ.చంద్ర మోహన్, రెడ్డి పాల్గొన్నారు.పుస్తక రచయిత,బాలసాహిత్యరత్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు